సెప్టెంబర్ 05:
సిర్పూర్ (టి): సిర్పూర్ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి. సర్పంచ్ అజ్మేర చత్రునాయక్ ఆధ్వర్యంలో, చింతకుంట నాయక్ అజ్మేర మోహన్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ బంజారా–లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగల్లో తీజ్ ఒకటని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతి పట్ల సద్భావనను చాటే ఇలాంటి పండుగలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చింతకుంట గ్రామంలో తీజ్ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.అనంతరం సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవి అమ్మవార్లకు బోగ్ బండారో కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీజ్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ
కార్యక్రమంలో ఎంపీడీవో కోట ప్రసాద్, తహసీల్దార్ రహీముద్దీన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శాలిని, ఉపసర్పంచ్ గాజిరెడ్డి మోహన్, మాజీ ఎంపీటీసీ మంగీలాల్, మాజీ సర్పంచ్ మహేందర్, సింగిల్ విండో డైరెక్టర్ మహేశ్వర్, అజ్మీర పోచనాయక్, భూక్యా గోవింద్ నాయక్, లావుడే ప్రకాష్, అజ్మీర శ్రీనివాస్, భూక్యా విగ్నేష్, మాలోత్ హరిసింగ్, లావుడే తిరుపతి, భూక్యా ప్రభునాయక్, స్థానిక వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామ ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

