ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు 

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

*మంచిర్యాల జిల్లా*

ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

సెప్టెంబర్ 4, 2026:

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

spot_img
spot_img

Related articles

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల...

గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం...

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన... కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:) ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు...

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం  సెప్టెంబర్ 4, 2026: విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026”కు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.