తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం చేసిన ప్రజలకు కావేటి సబిత కృతజ్ఞతలు. కవితమ్మ పై ఎమ్మెల్యే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం చేసిన ప్రజలకు కావేటి సబిత కృతజ్ఞతలు.

కవితమ్మ పై ఎమ్మెల్యే వాక్యా

 

అక్టోబర్ 30న ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన పంచజన్య సభను విజయవంతం చేసిన ప్రజలకు సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక తమ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితపై కొందరు ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె మండిపడ్డారు.ముఖ్యంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, గత మున్సిపల్ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్య విషయంలో ఆయన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.కవిత నాయకత్వ సామర్థ్యం, రాజకీయ అర్హతను ప్రశ్నించే స్థాయి ఎమ్మెల్యేకు లేదని సబిత పేర్కొన్నారు. కవిత ఒక ఉద్యమకారిణిగా, పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారని, సామాజిక న్యాయం లక్ష్యంగా రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకులు పుట్టుకతో కాకుండా ప్రజా పోరాటాలు, అనుభవంతో ఎదుగుతారని పేర్కొంటూ.. ‘లీడర్స్ ఆర్ నాట్ బార్న్, లీడర్స్ ఆర్ మేడ్’ అని వ్యాఖ్యానించారు.కవితకు ప్రజల్లో ఆదరణ లేదన్న వ్యాఖ్యలను కూడా ఆమె తప్పుబట్టారు. తెలంగాణ రక్షణ సేన పేరును వక్రీకరించి ‘రాక్షస సేన’గా పేర్కొనడం బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేకు తగదన్నారు. గతంలో రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత పరిచయంతో జరిగిన సంభాషణను రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని అన్నారు. భవిష్యత్తులో తమ అధినేత్రి గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యేకు సూచించారు. పార్టీ పేరు, నాయకత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.

spot_img
spot_img

Related articles

మల్లంపేట గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవం

కోటపల్లి మండలం లోని మల్లంపేట గ్రామ పంచాయతీ లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ తాళ్ల...

టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మంతెన సమ్మయ్య.

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యుజె—ఐ జెయు) జిల్లా కార్యవర్గ సభ్యు డిగా భీమారం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మంతెన సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాలలో నిర్వహించిన టియుడబ్ల్యుజె–ఐజెయు...

వేలాల ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు

జైపూర్ మండలం వేలాల గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తేదీ.13.11.2026 శుక్రవారం రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కె.శారద  ఆధ్వర్యంలో చిన్నారుల...

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు

భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.